ప్ర‌భాస్‌తో ర‌ష్మిక మూవీ.. థియేట‌ర్‌లోనే శ‌వ‌మ‌వుతాన‌న్న‌ నెటిజ‌న్‌!

admin
Published by Admin — November 04, 2025 in Movies
News Image

ఇటు సౌత్ తో పాటు అటు నార్త్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది ర‌ష్మిక‌. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ఆమె నుంచి నాలుగు సినిమాలు రాగా.. అందులో రెండు హిట్లు, మ‌రో రెండు యావ‌రేజ్‌గా ఆడాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక `ది గ‌ర్ల్‌ఫ్రెండ్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న థియేట‌ర్స్ లో రానుంది. 

ఈ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ప్రమోష‌న్స్‌లో భాగంగా ర‌ష్మిక త‌న అభిమానులతో చాట్‌ సెషన్‌ నిర్వహించింది. అందులో ఆమెకు ఓ నెటిజ‌న్ వేసిన కామెంట్‌ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. స‌ద‌రు నెటిజన్ ర‌ష్మికను అడిగాడు.. ``మీరు ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టిస్తారా? అదే జ‌రిగితే మీ కాంబో హైప్ దెబ్బ‌కు నా శవం థియేటర్‌లో ఉంటుంది.. దాన్ని కలెక్ట్ చేసుకోండీ” అంటూ కామెంట్ చేశాడు. ఆ ట్వీట్ చూసి ర‌ష్మిక కూడా చిరునవ్వు ఆపుకోలేకపోయింది.

దానికి ఆమె రిప్లై ఇస్తూ.. “ప్రభాస్‌తో నటించాలనుంది. నిజానికి ఆయ‌న‌తో యాక్ట్ చేయ‌డం నాకు కూడా ఇష్టమే. ప్ర‌భాస్ ఈ మెసేజ్‌లు చూస్తారని ఆశిస్తున్నా. ఫ్యూచ‌ర్‌లో తామిద్దరూ క‌లిసి న‌టిస్తే నా కెరీర్‌లో అది చాలా స్పెషల్‌ మూవీగా నిలుస్తుంది,” అని సమాధానం ఇచ్చింది. రష్మిక ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అభిమానులు “ఈ కాంబో వస్తే థియేటర్లు కదిలిపోతాయి”, “రష్మిక – ప్రభాస్ స్క్రీన్ పై చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags
Rashmika Prabhas Tollywood Latest News Rashmika Mandanna
Recent Comments
Leave a Comment

Related News