2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొట్టతొలి సారిగా `ప్రజాదర్బార్` పేరుతో ప్రజల నుంచి వినతులు స్వీక రించే కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆ తర్వాతే.. ఇది చంద్రబాబు సూచనల మేరకు నియోజకవ ర్గాలు, జిల్లాలకు విస్తరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఇక, కలెక్టర్లు, ఎస్పీలు `ప్రజా స్పందన` పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడే సమస్యలను పరిష్క రిస్తున్నారు. అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించేందుకు సమయం నిర్దేశిస్తున్నారు.
కాగా.. కొన్నాళ్ల పాటు విదేశీ పర్యటనలు చేయడం.. మంత్రివర్గ సమావేశాలు, తుఫాను కారణంగా.. వాయిదా పడుతూ వచ్చిన ప్రజాదర్బార్‌ను మరోసారి మంత్రి నారా లోకేష్ మంగళవారం నిర్వహించారు. ఇది ఆయన ప్రజలతో మమేకం కావడం 70 వ సారి. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. రెండు వరుసలుగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు.. ఏడు వరుసలకు పెరిగాయంటే.. ప్రజాదర్భార్‌కు ఏ రేంజ్‌లో స్పందన వచ్చిందో అర్ధమవుతుంది. అంతేకాదు.. వచ్చిన వారికి టీలు, కాఫీలతో పాటు.. సమీపంలోని అన్న క్యాంటీన్ నుంచి భోజనాలు కూడా తెప్పించారు.
ఇక, మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రజాదర్బార్.. రాత్రి 7 గంటలకు కూడా కొనసాగింది. ఈ మొత్తం సమ యంలో నారా లోకేష్ నిలబడే ఉండడం గమనార్హం. అంతేకాదు.. వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించడంతోపాటు వారు చెప్పిన సమస్యలను ఓపికగా విన్నారు. అంతేనా.. కొందరు సెల్ఫీలు తీసుకోవాలని కోరగా.. ఎంతో మురిపెంగా.. వారికి సెల్ఫీలు ఇచ్చారు. ఇలా.. మొత్తంగా ప్రజాదర్బార్‌కు వచ్చిన వారి సమస్యలు వినడంతోపాటు.. వారికి భరోసా కూడా కల్పించారు. కీలకమైన ఆర్థికేతర సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఎందుకీ తేడా..?
వాస్తవానికి ప్రతి రోజూ.. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. అంటే దీనిలో టీడీపీ నా యకులు రోజూ ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో కుదిరినప్పుడు సీఎం చంద్రబాబు కూడా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు.. మంత్రి నారా లోకేష్ దగ్గర నిర్వహించిన ప్రజాదర్భార్‌కు వేల మంది ఎందుకు వచ్చినట్టు? అంటే.. ఆయనపై ఉన్న భరోసా. అంతేకాదు.. నారా లోకేష్ వెంటనే పనిచేస్తున్నారన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది. ఆయన మౌఖిక ఆదేశాలతోనే కొన్ని పనులు అవుతుండడం కూడా ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని చెప్పాలి.