టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహార శైలిపై టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొలికపూడితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా చిన్నిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇసుక, రేషన్ మాఫియాలపై ఫోకస్ చేసిన చిన్ని మిగతా విషయాలు పట్టించుకోవడం లేదని వారంతా గరంగరంగా ఉన్నారట. అయితే, లోకేష్ పేరు తరచుగా చిన్ని ప్రస్తావిస్తూ ఉండడంతో వారెవరూ నోరు విప్పే సాహసం చేయలేదట.
అయితే, చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణల తర్వాత వారంతా తమ గళం విప్పడం మొదలుబెట్టారు. కోట్లాది రూపాయల బిజినెస్ చేస్తానని చెప్పుకునే చిన్నికి విజయవాడలో సొంత ఇల్లు కూడా లేదన్న విషయం ఇప్పుడే అందరికీ తెలిసిందట. చిన్నిపై కొలికపూడి ఆరోపణలపై వివరాలు సేకరించిన తర్వాత చిన్నిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఆ క్రమంలోనే విజయవాడ పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలకు, ఉన్నతాధికారులకు చిన్ని గురించిన విషయాలు తెలియజేశారట. ఆ కోవలోనే చిన్నిని లోకేష్ కూడా దూరం పెట్టారు. మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించిన లోకేష్...చిన్నిని అక్కడకు రావద్దని చెప్పారట. వాస్తవానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో చిన్ని ఆ మ్యాచ్ కు హాజరు కావాల్సి ఉంది.
17 నెలలుగా చిన్ని పనితీరుతో కృష్ణా జిల్లా టీడీపీకి తీవ్ర నష్టం జరిగిందట. దీంతో, చిన్నిని ఇప్పుడు పక్కన పెట్టకపోతే... ఏదో ఒక రోజు లోకేష్ ఇమేజ్ కు డ్యామేజ్ తప్పదని పార్టీ హై కమాండ్ ఫిక్సయిందట. ఎంపీగా చిన్నిని తప్పించలేని పరిస్థితి ఉందిగనుక..పార్టీలో ఆయన పాత్ర నామమాత్రం చేయాలని నిర్ణయించుకున్నారట.