``అధైర్యపడొద్దు.. నేనున్నా, ఆదుకుంటా. అందరికీ న్యాయం చేస్తా`` అంటూ ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా అన్నదాతలకు ధైర్యం నూరిపోశారు. ఇటీవల రాష్ట్రంలో మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీనివల్ల సుమా రు 15 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై అనేక అంచనాలు కూడా వేశారు. తొలి దశ నుంచి ప్రస్తుతం ఇంకా పంటల ఎన్యూమరేషన్ జరుగుతోంది. అయితే.. వైసీపీ అధినేత జగన్ ఇటీవల రైతులను పరామర్శించేందుకు వెళ్లి.. వారిలో గుబులు రేపారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని.. 25 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగితే..కేవలం 7-10 లక్షల హెక్టా ర్లేనని చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని.. పైగా.. పంటలబీమా ఉన్న రైతులకు పరిహారం ఇచ్చేందుకు కూడా వెనుకాడుతోందన్నారు. అంతేకాదు..రైతుల గుండెల్లో మరో గునపం కూడా దింపారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్‌లో రాయించుకు ని పరిహారం తీసుకుంటే.. ఇక ఈ ఖరీఫ్‌కు వారి నుంచి పంటలు కూడా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. దీంతో రైతన్న లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే.. మరణమే శరణ్యమంటూ కృష్ణాజిల్లా రైతులు నిరసనకు దిగారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. రైతులను ఆదుకునేందుకు తాను ముందుంటానని చెప్పారు. ఎవరూ ఆందోళన వ్యక్తం చేయద్దని.. భయపడి.. బాధతో ఆత్మహత్యలకు అస్సలే ప్రయత్నించరాదనికూడా ఆయన చెప్పుకొచ్చా రు. ``రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు`` అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రైతుల పంట నష్టంపై ప్రస్తుతం అంచనాలు వేస్తున్నామని(ఎన్యూమరేషన్).. అన్ని వివరాలువచ్చాక.. వారిని ఆదుకుంటామని తెలిపారు. 16 మాసాల కాలంలో రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకున్నామని చెప్పారు. పంటల బీమా కూడా చెల్లించామన్నారు.
గతంలో వచ్చిన వర్షాలు, వరదలకు మునిగిపోయిన పంటలను కూడా కొనుగోలు చేశామన్నారు. పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు ఇస్తున్నామని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం నీటికి కూడా ఎలాంటి ఇబ్బందీ లేదని.. రైతులు స్వేచ్ఛగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. తరచుగా వచ్చే తుపాన్ల వల్ల కూడా రైతులు నష్టపోతున్నారని వారి కోసం కేంద్ర ప్రభుత్వంతో త్వరలోనే మాట్లాడతానని అభయం ప్రసాదించారు. ``ఎవరో ఏదో చెప్పారని.. మీరు నమ్మొద్దు. ప్రభుత్వం, యంత్రాంగం, అధికారులు అందరూ అండగా ఉంటారు. `` అని భరోసా కల్పించారు.