ఏపీలో ఇళ్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ‘అందరికీ ఇళ్లు’ (హౌసింగ్ ఫర్ ఆల్) హామీ నెరవేర్చేందుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాబోయే మూడేళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాలిచ్చి వదిలేయకుండా ఇకపై ప్రతి 3 నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 3 లక్షలకు పైగా ఇళ్లలో గృహప్రవేశాలు చేయించామని అన్నారు.