ధనుష్‌తో డేటింగ్.. మృణాల్ క్లారిటీ!

admin
Published by Admin — December 01, 2025 in Movies
News Image

ఫిల్మ్ ఇండస్ట్రీలో లింక్‌అప్ రూమర్లు కొత్తవి కావు. కానీ ఇటీవల ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారింది ధనుష్ – మృణాల్ ఠాకూర్ పేర్లు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఊహాగానాలు ఎంత వేగంగా పాకాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారణాసి ట్రిప్ నుంచి మొదలైన ఈ రూమర్లు, రీల్ కమెంట్స్‌, ఇన్‌స్టా ఇంటరాక్షన్స్‌తో మరింత మసాలా జోడించాయి.

అయితే ఈ రూమ‌ర్ల‌పై తాజాగా మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన చిన్న వీడియోతోనే రూమర్లకు ఇన్‌డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చారు. వీడియోలో ఆమె తలకు ఆయిల్ పెట్టించుకుంటూ గట్టిగా నవ్వుతుండటం, పైగా `వాళ్లు మాట్లాడుకుంటారు… మనం నవ్వుకుంటాం. రూమర్లు అంటే ఫ్రీ పీఆర్. నాకు ఉచితంగా వచ్చేవి ఇష్టం` అంటూ క్యాప్షన్ ఇవ్వ‌డం నెటిజన్లను ఆకర్షించింది.

మృణాల్ ఎక్కడా ధనుష్ గురించీ ప్రస్తావించనప్పటికీ… ఆమె మాటలు మాత్రం `తనకు ఈ వదంతులపై టెన్షన్ లేదని, వాటిని సీరియస్‌గా తీసుకోనని` స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె నవ్వే రియాక్షన్‌తోనే రూమర్లకు క్లీన్ కౌంటర్ ఇచ్చినట్లు అయింది. దీంతో ఈ పుకార్లు సోషల్ మీడియా ఊహాగానాలే తప్ప, వాస్తవానికి దూరంగా ఉన్నాయని నెటిజన్లు కూడా అర్ధం చేసుకున్నారు.

Tags
Mrunal Thakur Dating rumours Dhanush Tollywood Kollywood
Recent Comments
Leave a Comment

Related News