పార్లమెంట్‌లో హీట్ వార్‌.. రామ్మోహన్ దెబ్బ‌కు మిథున్ రెడ్డి సైలెంట్!

admin
Published by Admin — December 01, 2025 in Politics, Andhra, National
News Image

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మొదలైన తొలి రోజే హీట్ పెరిగింది. ఏపీ రాజకీయాల దిశగా జరిగిన వాగ్వాదం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతుండగా, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్చిన ఘాటు కౌంటర్ ఒక్కసారిగా సభలో టెన్షన్ క్రియేట్ చేసింది.

మిథున్ రెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న అరెస్టులు, కేసులు, రాజకీయ వేధింపులను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. “ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?” అంటూ ప్రశ్నించిన ఆయన.. తమ పార్టీ నాయకులపై ప్రభుత్వ కోపం ఎంత పెరిగిందో వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించాడు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం ఏ రీతిలో ప్రత్యర్థులను వెంటాడిందో, ఎన్ని కేసులు పెట్టిందో, ఏపీ పరిపాలన ఎలా దెబ్బతిన్నదో గుక్క తిప్పుకోకుండా చెప్పేశారు.

రామ్మోహన్ యొక్క మాటల దాడికి సభ ఒక క్షణం నిశ్శబ్దంగా మారింది. మ‌రోవైపు మిథున్ రెడ్డికి సైతం దెబ్బ‌కు సైలెంట్ అయిపోయారు. ఆయ‌న నోట మాట రాని ప‌రిస్థితి. అయిదేళ్ల క్రితం ఇదే మిథున్ రెడ్డి రామ్మోహన్ నాయుడిని స‌భ‌లో  సాటి తెలుగు ఎంపీ అని చూడకుండా “కూర్చోరా భాయ్, నువ్వు మాట్లాడింది చాలు” అని ఎగతాళి చేశారు. ఆ సమయంలో చిన్నపాటి ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు… ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎదిగి, అదే సభలో మిథున్‌కు ఘాటు బదులు ఇవ్వడం రాజకీయంగా రివేంజ్ తీర్చుకున్న‌ట్లు అయింది.

Tags
Ram Mohan Naidu Peddireddy Mithun Reddy YSRCP TDP Parliament Sessions
Recent Comments
Leave a Comment

Related News