టాలీవుడ్ అగ్ర నటిగా వెలుగొందుతున్న సమంత తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఎన్నాళ్లుగానో ఊహాగానాలుగా మారిన ఆమె రెండో వివాహంపై వచ్చిన వార్తలకు ఈరోజుతో ఫుల్ స్టాప్ పడింది.

నేటి తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల నడుమ దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత వివాహం చేసుకుంది.

తాజాగా పెళ్లి ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోవడంతో.. `ఇట్స్ అఫీషియల్` అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పెళ్లి వేడుకలో సమంత ఎర్రని చీరలో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయింది.

సమంత కొత్త ప్రయాణానికి సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌ల షూటింగ్ సమయంలో దగ్గరైన వీరి బంధం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది. అయితే సమంతతో పాటు రాజ్‌కు కూడా ఇది రెండో వివాహమే. నెలలుగా కొనసాగుతున్న వీరి డేటింగ్ రూమర్లు ఈ రోజు పెళ్లితో అధికారికంగా నిజమయ్యాయి.
