సోషల్ మీడియా ఈ రోజు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందనే వార్తలు నిన్నటి రాత్రి నుంచే రచ్చ రేపుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి ఈ రూమర్లు మరింత వేగం పుంజుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి దే చేసిన ఒక సంచలనాత్మక పోస్ట్.
సమంత, రాజ్ నిడమోరు దాదాపు ఏడాదిన్నర నుంచి రిలేషన్‌లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పుడీ జంట మరో అడుగు ముందుకేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. సోమవారం, డిసెంబర్ 1న రాజ్‌తో సమంత రెండో పెళ్లి జరగబోతుందని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా పౌండేషన్ యోగా సెంటర్ వీరి వివాహానికి వేదిక కానుందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలను మొదట పుకార్లుగానే భావించినా.. రాజ్ మాజీ భార్య శ్యామలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారని పోస్ట్ పెట్టడంతో ఈ మ్యాటర్ కాస్త నేషనల్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. శ్యామలి పోస్ట్ సమంత రెండో పెళ్లి వార్తలకు బలాన్ని చేకూర్చింది. విచిత్రం ఏమిటంటే… ఈ సంచలనంపై ఇప్పటివరకూ సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఖండించలేదు కూడా. ఇదే నెటిజన్లకు మరింత అనుమానం కలిగిస్తోంది. “ఎక్కడ పొగ ఉందో అక్కడే మంట ఉంటుంది” అన్నట్టుగా మొత్తం సోషల్ మీడియా సమంతపై మళ్లీ దృష్టి పెట్టింది.