అమెరికాలోని ఎన్నారైలకు ధన్యవాదాలు తెలిపేందుకు మంత్రి నారా లోకేశ్ ఈ నెల 6న డాలస్ లో ప్రత్యేకంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికాలో చదువుతున్న ప్రవాసాంధ్ర విద్యార్థులకు ఏపీఎన్నార్టీఎస్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. డిసెంబరు 6న డాలస్ లో జరిగే లోకేశ్ థ్యాంక్స్ మీట్ కు హాజరయ్యే ప్రవాసాంధ్ర విద్యార్థులు...ప్రవాసాంధ్ర బీమా పథకం ప్రీమియాన్ని ఒక సంవత్సరం పాటు ఉచితంగా పొందవచ్చు.
అంటే ఈ బీమాకు సంబంధించిన ఒక సంవత్సరం ప్రీమియాన్ని తెలుగు డయాస్పోరా 2025 సమావేశానికి హాజరయ్యే విద్యార్ధులకు ఉచితంగా లభించనుంది. ప్రమాదవశాత్తూ మరణించడం, ప్రమాదవశాత్తూ అంగవైకల్యం, వైద్య ఖర్చులు, అదనపు బీమా లాభాలు ఉచితంగా లభించనున్నాయి. టెక్సాస్ లోని గార్లాండ్ లో డిసెంబరు 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
మరిన్ని వివరాల కోసం ఏపీఎన్నార్టీఎస్ హెల్స్ లైన్ నంబర్ +91 8632340678 ను సంప్రదించండి.
వాట్సాప్ నంబర్: +918500027678
https://apnrts.ap.gov.in/pbb_