ప్రస్తుతం రాజకీయ దుమారం రేకెత్తించిన `సంచార్ సాథీ`(ఎక్కడికెళ్లినా మీ వెంటే) యాప్.. పై దేశవ్యాప్తం గా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తి ఒక మంచి పనే చేశాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఏడాది కాలంగా ఈ యాప్ ఉన్నా.. దేశంలో చాలా తక్కువ మందికే దీని గురించి తెలుసు. కానీ.. ఇప్పుడు వివాదం అయ్యాక.. అసలు సంచార్ సాథీ అంటే ఏంటి? దీని ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ను జనవరిలోనే తీసుకువచ్చింది. మొబైల్ ఫోన్లకు అత్యత రక్షణ కల్పించే ఈయాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ యాప్ ద్వారా వినియోగదా రులు తమ ఫోన్లను ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా పోన్ చోరీ అయినప్పుడు దానిని డీయాక్టివేట్ చేసుకుని.. సమాచారం, నగదు వంటి విషయాల్లో ఎలాంటి తప్పులు జరగకుండా కూడా చూసుకోవచ్చు. దీనిని ఇప్పటి వరకు ఫోన్ పోగొట్టుకున్న సందర్భాల్లో తప్ప.. ఎక్కువగా వినియోగిం చడం లేదు.
తాజాగా ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడు సంభవించినప్పుడు.. దేశంలో కలకలం రేగింది. దీనిపై దృష్టి పెట్టిన కేంద్రం ఈ వ్యవహారం అంతా ఫోన్ల ద్వారా నే జరిగినట్టు గుర్తించింది. సాధారణ వైద్యులకు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని తెలుసుకున్నాక.. సంచార్ సాథీ యాప్‌ను ఇన్ స్టాల్ చేయడం తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. విపక్షాలు ఆందోళన చేయడంతో దీనిని వెనక్కి తీసుకున్నారు. కొత్త ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది. అయితే.. ఉంచుకోవాలా? డిలీట్ చేసుకోవాలా? అనే యూజర్ ఇష్టం.
ఏంటి లాభం..
+ పోగొట్టుకున్న ఫోన్లను తక్కువ వ్యవధిలో గుర్తించవచ్చు.
+ సమాచారం లీక్ కాకుండా చూసుకోవచ్చు.
+ మొబైల్‌కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నంబర్ ను ఈ యాప్‌కు అనుసంధానం చేయొచ్చు.
+ తద్వారా ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వాటిని పసిగట్టవచ్చు.
+ వేరే వ్యక్తులు సిమ్ మార్చినా ఫోన్ పనిచేయకుండా చేస్తుంది.
+ తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు, సందేశాలు వస్తే.. ఫిర్యాదు చేసేందుకు అనుమతిస్తుంది.