అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీపి కబురు చెప్పారు. ఇకనుంచి వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ప్రకటించారు. దీంతోపాటు దివ్యాంగులకు మొత్తం 7 వరాలను చంద్రబాబు ప్రకటించారు.
1. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
2. స్థానిక సంస్థల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నామినేట్ అయ్యే అవకాశం
3. ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ
4. క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు
5. హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్లలో ఇళ్లు
6. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కాలేజీ
7. అమరావతిలో 'దివ్యాంగ్ భవన్'