వైసీపీ నాయకులు చెబుతున్న మాటలు నమ్మితే.. రైతులు మరోసారి నష్టపోతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ``వారు చెబుతున్న మాటలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మీరే(రైతులు) రాష్ట్ర వ్యాప్తంగా అంద రూ నష్టపోయారు. రాష్ట్రం కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు కూడా వారు ఇలానే వ్యవహ రిస్తున్నారు. మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వారు చెబుతున్న మాటలు నమ్మితే.. మరోసారి నష్టపోతారు`` అని వ్యాఖ్యానించారు.
తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు నల్లజర్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీ కోసం- కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. వారి సమ స్యలు విన్నారు. అన్నివిధాలా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. విద్యుత్ చార్జీలను పెంచుతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ అలా జరగదని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ విద్యుత్ చార్జీలను పెంచేది లేదన్నారు.
ఈ సందర్భంగా సాగుకు సాకేంతికతను జోడించేందుకు ఉన్న అన్ని అవకశాలను రైతులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. ఒకప్పుడు రైతులు తెల్లవారుతున్నప్పుడే పొలాలకు వెళ్లేవారని.. ఇప్పుడు స్మార్ట్ అగ్రికల్చర్ విధానాలు వచ్చాయని.. డ్రోన్లే అన్నీ చూసుకుంటున్నాయని.. రైతులు ఇళ్లలో కూర్చుని కూడా వ్యవసాయాన్ని మేనేజ్ చేసే పరిస్థితి తీసుకువచ్చామన్నారు. ఈ క్రమంలో సాగుకు 5 కీలక సూత్రాలను అమలు చేయాలని నిర్ణయించామన్నారు.
ఈ ఐదు సూత్రాలను పాటిస్తే.. రైతులు మరింత ఎక్కువగా దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంద ని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యతను తీసుకున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండు విడతలుగా 14 వేల చొప్పున ఇచ్చామని తెలిపారు. ``రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం.`` అని చంద్రబాబు వివరించారు.