నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ-2` సినిమాకు ఏపీ ప్రభుత్వం భారీ ఎనౌన్స్‌మెంటు చేసింది. ఈ సినిమా ఈ నెల 5న విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షో కు ప్రత్యేకంగాటికెట్ ధరలను నిర్ణయించిన ప్రభుత్వం.. తదుపరి సినిమా విడుదల రోజు నుంచి పది రోజులపాటు మరో ధరలు అందుబాటులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది.
దిగ్గజ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం `అఖండ` మూవీకి సీక్వెల్‌గా నిర్మించిన అఖండ-2 ఇప్పటికే ప్రేక్షకుల అంచనా లకు మించిన విధంగా ప్రచారంలో దూసుకుపోతోంది. బాలయ్య నట విశ్వరూపాన్ని తెరపై చూసేందుకు ఆయన అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల మూవీ టీంసంతోషం వ్యక్తం చేసింది. సినిమా టోగ్రఫీ మంత్రి సహా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది.
ఇవీ టికెట్ ధరలు..
+ ప్రీమియర్ షో టికెట్ ధర: 600 రూపాయలు
+ సినిమా విడుదలైన 5వ తేదీ నుంచి.. సింగిల్ స్క్రీన్: రూ.75
+ మల్టీ ప్లెక్స్‌లో టికెట్‌కు 100 రూపాయల ధర పెంచుకోవచ్చు.
+ ఈ నెల 4న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించుకునేందుకు అనుమతి.