వైసీపీ హయాంలో పరకామణి హుండీ లెక్కింపు సందర్భంగా జరిగిన చోరీపై ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అదో చిన్నచోరీ అని, దానిని పెద్దది చేయాల్సిన అవసరం లేదని జగన్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 72 వేల రూపాయల విలువైన 9 డాలర్ నోట్లు దొంగతనం చేశారని, దానికి ప్రాయశ్చితంగా 14 కోట్ల విలువైన ఆస్తులను ఆ దొంగ కుటుంబం ఆలయానికి విరాళంగా ఇచ్చిందని జగన్ అన్నారు. అనేక ఆలయాల్లో ఆ టైపు చోరీలు జరిగినా సరే..దొంగలు ప్రాయశ్చిత్త విరాళాలివ్వలేదని జగన్ చెప్పడం కొసమెరుపు.
మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ ఒక దొంగతనాన్ని చిన్నది..పెద్దది అని డిసైడ్ చేయడంపై ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ వ్యాఖ్యలు దొంగతనాలను ప్రోత్సహించేలా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. జగన్ చేసిన కామెంట్లు సమాజానికి తప్పుడు సందేశం పంపేలా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.