ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో రూ.20,444 కోట్ల విలువైన నూతన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. వాటి ద్వారా రాష్ట్రంలో 56,278 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు వస్తాయి. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల పురోగతిపై కూడా చంద్రబాబు సమీక్షించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లే ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలన వంటి పరిస్థితులుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావని చెప్పారు. వైసీపీ మార్క్ చెరిపేసి ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ఫలితంగా విశాఖ సదస్సు విజయవంతమైందని అన్నారు.