ఏపీ ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ పలు కంపెనీల సీఈవోలే, ఎండీలతో లోకేశ్ భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితోనూ లోకేశ్ సమావేశయ్యారు. ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని చెప్పారు. ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మరోవైపు, ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అయిన లోకేశ్ అమరావతిలో డిజైన్ & ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ తో సమావేశమైన లోకేశ్...ఏపీలో యూఎస్ పెట్టుబడులకు సహకారం అందించాలన్నారు. ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని జడ్ స్కాలర్ సీఈవో జే చౌదరిని విజ్ఞప్తి చేశారు. సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ తో సమావేశమైన లోకేశ్... అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. రిగెట్టి కంప్యూటింగ్ సీటీవో డేవిడ్ రీవా తో భేటీ అయిన లోకేశ్...ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.