రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత.. పనుల వేగం పుంజుకుంది. దీనిలో మంత్రులను ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో చేపడుతున్న పనుల బాధ్యతను మంత్రులకే అప్పగిం చారు. దీనికి తోడు మంత్రులు ఇంచార్జ్‌లుగా ఉన్న జిల్లాల బాధ్యతలను కూడా వారికే ఇచ్చారు. అంటే.. ఆయా జిల్లాల్లో చేపడుతున్న పనులను కూడా మంత్రులు పర్యవేక్షించాలి. ప్రజలకు ఇబ్బందులు రాకుం డా చూసుకోవాలి. ఇదొక కార్యక్రమం.
ఇక, శాఖల పరంగా చూసుకుంటే.. మంత్రులు నిర్వహిస్తున్న శాఖలతోపాటు వారిలో కొందరికి అదనపు శాఖలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఆయన అసెంబ్లీ వ్యవహారాలను కూడా చూసుకోవాలి. మంత్రి అనితకు హోం శాఖతోపాటు.. విప త్తుల నిర్వహణ శాఖ కూడా ఉంది. ఇక, మంత్రి నారా లోకేష్ చేతిలో మూడు శాఖల బాధ్యతలు ఉంచారు. డిప్యూటీ సీఎం పవన్ కు కూడా.. మూడు శాఖలు ఇచ్చారు.
ఇలా.. కొందరు మంత్రులకు ఒకటికి మించి ఎక్కువ శాఖలను అప్పగించారు. ఇది రెండో కార్యక్రమం. ఇక, మూడో విషయానికి వస్తే.. ఆయా శాఖలను పర్యవేక్షిస్తూనే.. మరోవైపు ఫైళ్ల క్లియరెన్సుకు సీఎం చంద్రబా బు టైం పెట్టారు. కేవలం నెల రోజులకు మించి ఏ పేషీలోనూ.. ఫైలు ఉండకూడదని తేల్చి చెప్పారు. మరోవైపు.. ప్రతిపక్షం చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలని మంత్రులకు తేల్చి చెప్పారు. ఇలా.. ఒక మంత్రిపై.. అదనంగా చాలా బాధ్యతలు వచ్చి పడ్డాయి.
ఎఫెక్ట్ ఏంటంటే..
ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ సమయం మంత్రులు పనిచేయాల్సి వస్తోందన్న టాక్ వారి నుంచే వినిపిస్తోంది. ``మా కన్నా.. ఐటీ ఉద్యోగులే బెటర్. వారికి కనీసం వీక్లీఆఫ్ అయినా ఉంటుంది`` అని మంత్రి ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. ఇక, మరికొందరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పైగా వేకేషన్‌కు వెళ్తామని ఒకరిద్దరు ఇటీవల సీఎం దగ్గర ప్రతిపాదించగా.. 2029 వరకు ఎలాంటి వేకేషన్ లేదని తేల్చి చెప్పారు. సో.. మొత్తంగా.. మంత్రులపై ప్రభావం అయితే పడుతోందన్నది వాస్తవం.