తెలంగాణ మంత్రి కొండా సురేఖను గతంలో చేసిన కొన్ని కామెంట్లకు సంబంధించిన కేసు వెంటాడుతూ నే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొండా సురేఖ.. అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. అవి కాస్తా వివాదానికి దారి తీసి.. కేసుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కోర్టు.. విచారణకు రావాలని ఆదేశించింది. కానీ.. సురేఖ మాత్రం డుమ్మా కొట్టారు. తాజాగా దీనిపై మరోసారి విచా రణ జరిపిన నాంపల్లి కోర్టు.. సురేఖకు నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది.
ఏం జరిగింది?
బీఆర్ ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటు అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంత, ఇటు మాజీ మంత్రి కేటీఆర్‌లపైనా ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో అక్కినేని సమా కేటీఆర్ లు పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. వీటిలో ఇటీవల అక్కినేని కుటుంబానికి సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీంతో అక్కినేని కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
కానీ, కేటీఆర్‌కు ఆమె క్షమాపణలు చెప్పలేదు. రాజకీయంగా ఈ వివాదం కూడా ముదురుతోంది. ఈ క్రమం లో ఇటీవల నాంపల్లిలోని కోర్టు మంత్రి సురేఖకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. ఆమె కోర్టుకు హాజరుకాలేదు. తాజాగాశుక్రవారంసాయంత్రం ఈ కేసు మరోసారి విచారణకు రాగా.. మంత్రి వ్యవహారంపై సీరియస్ అయిన కోర్టు.. ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేస్తూ. ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇప్పుడు సురేఖ తప్పని సరిగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.