విశాఖ అభివృద్ధికి ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షిస్తున్న సీఎం చంద్రబాబు.. 2032 నాటికి ఈ నగరాన్ని మరింత దూసుకుపోయే నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా(ఎకనామిక్) విశాఖ ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలని ప్రణాళికలు వేసుకున్నారు. తాజాగా విశాఖలో పర్యటించిన సీఎం.. విశాఖ ఆర్థిక ప్రాంతం(వీఈఆర్) ప్రణాళికను ఆవిష్కరించారు. దీనిలో భాగంగా 2032నాటికే ఈ నగరాన్ని 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయనున్నారు.
విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంతోపాటు.. ఆర్థికం గా పుంజుకునేలా చేయాలన్నది ప్లాన్. రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి కీలక మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇలా.,.. మొత్తం 49 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా.. సెల్ఫ్ హెల్ప్‌గా జిల్లా అభివృద్ధి చెందుతుందన్న అంచనా వేశారు. అంటే.. ఒకరకంగా.. విశాఖ స్వయం సమృద్ధి సాధించే జిల్లాగా పురోగమిస్తుంది.
అయితే.. ఐటీ, వ్యవసాయం, విద్య, వైద్యారోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్ రంగాల్లో విశాఖ ఆర్థిక ప్రాంతా నికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా శివారు ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలన్నది ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అదేసమయంలో విశాఖను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా.. రాజకీయంగా కూడా పైచేయి సాధించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే.. ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఏరియల్ సర్వే..
మరోవైపు. విశాఖలో ఇప్పటికే ప్రారంభించిన పలు ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అయి తే.. దీనికి గాను హలికాప్టర్‌ను వినియోగించారు. విశాఖలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయా పనుల ప్రగతిని ఆయన ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారు. ఆయా పనులపై అనంతరం అధికారులతో చర్చించారు. మొత్తంగా విశాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి.