వైసీపీలో డిస్క‌ర్ష‌న్‌.. మ‌ళ్లీ కూట‌మే కానీ... !

admin
Published by Admin — December 13, 2025 in Andhra
News Image
ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఎన్నిక‌లు జ‌రిగితే.. మ‌రోసారి కూట‌మి అధికారంలోకి రావ‌డం ప‌క్కా!. ఈ విషయా న్ని టీడీపీ నాయ‌కులు, బీజేపీ నేత‌లు చెప్ప‌డం లేదు. వైసీపీ నాయ‌కులే అంటున్నారు. పైకి ఎవ‌రూ బ యట ప‌డ‌క‌పోయినా.. అంత‌ర్గ‌త స‌మాచారం.. అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఖ‌చ్చి తంగా కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధానంగా 4 రీజ‌న్లు కూడా చెబుతున్నారు. ఒక్క వైసీపీ నాయ‌కులే కాదు.. త‌ట‌స్థులు కూడా ఇదే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

టీ షాపుల ద‌గ్గ‌ర‌, బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల ద‌గ్గ‌ర కూడా ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతోంది. ఏ న‌లుగురు క‌లిసినా కూట‌మిదే విజ‌య‌మ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నాయ‌కులు కూడా కూట‌మి వ‌స్తుంద‌న్న చ‌ర్చ చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న రీజ‌న్లు.. నాలుగు ఉన్నాయి. 1) సంక్షేమంతో కూడిన అభివృ ద్ధి: గ‌తంలో వైసీపీ సంక్షేమాన్ని మాత్ర‌మే ప్రాతిప‌దిక‌గా తీసుకుంది. కానీ, ఇప్పుడు కూట‌మి సంక్షేమంతో పాటు.. అభివృద్ధిని కూడా చూపిస్తోంది. పెట్టుబ‌డులు తీసుకువ‌స్తున్నారు. ఇది మెజారిటీ విజ‌యాన్ని అందిస్తుంద‌ని చెబుతున్నారు.

2) కూట‌మి బ‌లం:  ప్ర‌స్తుతం కూట‌మి చాలా బ‌లంగా ఉంది. పైస్థాయిలో నాయ‌కుల మ‌ధ్య‌క‌లివిడి స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది. ఇది కూడా పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. 3) ప‌వ‌న్ ఇమేజ్‌:  ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ గ‌త ఎన్నిక‌ల్లోనూ స్ప‌ష్టంగా క‌నిపించింది. బ‌ల‌మైన వాయిస్‌తోపాటు ఇప్పుడు స‌నాత‌న ధ‌ర్మాన్ని కూడా భుజాన వేసుకున్నారు. ఇది ఆయ‌న‌కు లాభిస్తుంద‌న్న‌ది మెజారిటీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆటోమేటిక్‌గా కూట‌మికి మేలు చేస్తుంద‌ని అంటున్నారు.

4) చంద్ర‌బాబు పాల‌న‌:  చంద్ర‌బాబు పాల‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు ప‌డుతున్నాయి. సంక్షేమం విష‌యంలోనూ ఆయ‌న‌కు మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. పైగా అమ‌రావ‌తి, పోల‌వ‌రం వంటి కీల‌క ప్రాజెక్టుల పూర్తికి ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా క‌లిసి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కూట‌మి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. గ‌తంలో వ‌చ్చిన‌న్ని సీట్లు వ‌స్తాయా? అనేది మాత్రం సందేహంగా ఉంద‌ని అంటున్నారు. అయినా.. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు కాబ‌ట్టి అప్ప‌టికి ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో చూడాలి.
Tags
ycp leaders predicting nda alliance win 2029 elections
Recent Comments
Leave a Comment

Related News