పీపీపీ విధానాన్ని తప్పుబడుతున్న వారిలో ఒక్క వైసీపీ మాత్రమే ఉందని అనుకుంటే పొరపాటే. కమ్యూని స్టుల నుంచి కాంగ్రెస్ వరకు చాలా మంది ఉన్నారు. అయితే.. వైసీపీ దూకుడు ఎక్కువగా ఉంది. ఇక, ఇప్పుడు చంద్రబాబు కేవలం మెడికల్ కాలేజీలను మాత్రమే పీపీపీ విధానంలో నిర్మిస్తామని చెబుతున్నా రు. కానీ, రాబోయే కొన్నేళ్లలో పాఠశాలల నుంచి గ్రామీణ రహదారుల వరకు పీపీపీ మోడల్‌ను అనుసరించ నున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికలు కూడా రెడీ అవుతున్నాయి.
వీటిపై కూడా ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే.. అసలు చం ద్రబాబు విజన్ ఏంటి? అనేది కీలకం. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించేందుకు చంద్రబాబు వ్యతిరేకమా? అనేది కూడా ప్రశ్న. అయితే.. ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గా ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు చేపడతా యన్నదిపైకి చెబుతున్నా.. జవాబుదారీ తనానికి చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేటుకు అప్పగించడం ద్వారా జవాబుదారీ తనానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అదే ప్రభుత్వం అయితే.. యంత్రాంగం నుంచి అధికారుల వరకు జవాబుదారీతనం వహించని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేసమయంలో టైం బౌండ్ లో నిర్మాణాలు కూడా పూర్తయ్యే అవకాశం, నిధుల సమస్య వంటివి కూడా వెంటాడుతాయి. అందుకే.. విజన్ ప్లే చేస్తున్నారు. ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఆయా పనులను వేగంగా పూర్తి చేయడంతోపాటు.. జవాబు దారీ తనానికి.. ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందన్న వాదన ఉంది.
ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీకి ఈ విషయం తెలియదా? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి అవగాహన లేదా? అంటే.. స్పష్టంగా ఉంది. సొంత పార్టీ ఎంపీనే పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికపై సంతకం చేసిన విషయం తెలియదని అనుకోవాలా? ఇవన్నీ కాదు.. కేవలం రాజకీయ కోణంలోనే వైసీపీ ఆలోచన చేస్తోంది. వాస్తవాలను దాచి విజన్‌పై దాడి చేస్తోంది అంటున్నారు పరిశీలకులు