ఏడాదిన్నర కూటమి పాలనలో సర్కార్ గ్రాఫ్ ఎలా ఉంది? ప్రజల నాడి ఏ విధంగా ఉంది? అమలు చేస్తున్న పథకాలు.. ప్రభుత్వ పరిపాలన వంటి విషయాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా `చాయ్ పై చర్చ` కార్యక్రమానికి వచ్చే నెల నుంచి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. 2014 ఎన్నికల్లో బిజెపి ఎన్నికల ప్రచారంగా `చాయ్ పై చర్చ` కార్యక్రమం తెర మీదకు వచ్చింది.
అప్పట్లో ఈ కార్యక్రమానికి మంచి పేరు వచ్చింది. ప్రజల్లోనూ బలంగా వెళ్ళింది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఇస్తున్న సంక్షేమం, తెస్తున్న పెట్టుబడులు, కల్పిస్తున్న ఉద్యోగ ఉపాధి అంశాలు.. ఇలా అన్ని విషయాలను ప్రజల మధ్య చర్చించి వారి అభిప్రాయాలను రాబట్టే విధంగా నిర్వహించనున్నారు. తద్వారా ప్రజల నాడిని నేరుగా తెలుసుకోవడంతో పాటు అవసరమైతే మార్పులు చేర్పులు తీసుకునేందుకు అవకాశం దక్కుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబం ధించి తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. `ఛాయ పే చర్చ` కార్యక్రమం ద్వారా మాస్ జనాలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రజల మధ్యకు నాయకులు మరింత చొరవగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 20-3. మంది వ్యక్తులతో కలిసి ప్రతిరోజు చాయ్ పై చర్చ కార్యక్రమం పెట్టడం ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వంలో అవసరమైతే మార్పులు చేసుకోవడం వంటివి చేయొచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన.
అనంతరం మరిన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. మొ త్తానికి ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజల ఆలోచనల మధ్య చాయిపే చర్చ ఒక వారధిగా నిలుస్తున్నది ప్రభుత్వం ఆలోచన. నిజానికి ఇప్పటి వరకు పోన్ల ద్వారా.. మాత్రమే ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కానీ, ఇప్పుడువినూత్నంగా చాయ్ పేచర్చను చేపట్టడం ద్వారా.. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. దీని ద్వారా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే మార్పులు చేయనున్నారు.