బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ మీటింగ్ నేడు జరిగింది. ఈ సమావేశంలో బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటానని అన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన భాధ్యత బ్రాహ్మణ సాధికార సమితిపై ఉందన్నారు. ఃః
2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 2019-2024లో బ్రాహ్మణ సాధికార సమితి ఏర్పాటు చేసి బ్రాహ్మణులను గౌరవించారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి బ్రాహ్మణ సాధికార సమితిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకు గరుడ పధకం పునః ప్రారంభం చేయబోతున్నామని తెలిపారు. ఉత్తరాయణంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఉచిత సామూహిక ఉపనయనంలు జరిపిస్తామన్నారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పంచమి నాడు వచ్చే అది శంకరుల జన్మదినోత్సవము శంకర జయంతితోపాటు రామానుజ జయంతిని రాష్ట్ర పండుగగా జరిపించాలని ప్రభుత్వాన్ని కోరాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
ఈ సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీ.వీ ఫణి కుమార్, శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు ఏ.వీ రమణ, టీ.వీ శ్రీరామమూర్తి, ఈమని సూర్య నారాయణ, గూడూరి శేఖర్, ఎం.వీ సత్యనారాయణ, చిత్రపు హనుమంత రావు, గార్లపాటి విజయ కుమార్, శ్రీశ్రీ శర్మ, భమిడిపాటి బాబు, హోత రవి, మల్లికార్జున, టీ.వీ రవిచంద్ర శర్మ, సీ.హెచ్ జనార్ధన్, దుర్వాసుల రామ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.