ఇప్పటి దాకా ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అంటూ రెండు రోజుల క్రితం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన సంగతి తెలిసిందే. నీ సంగతి చూస్తా...తోలు తీస్తా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కేసీఆర్, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రా బిడ్డ రా చూసుకుందాం...రెడీగ ఉన్నా అంటూ కేసీఆర్ ను ఛాలెంజ్ చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి అధికారం దక్కనివ్వబోనని శపథం చేశారు. ఇక, కేసీఆర్ ను జైల్లో వేస్తే సర్కారుకు తిండి ఖర్చు దండగ అని రేవంత్ ఎద్దేవా చేశారు.
అయితే, కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి మైకు ముందుకు రావం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నీ మొఖం ఎప్పుడైన చూసుకున్నవరా అద్దంలో...పేడమూతి బోడి లింగం...నువ్వు కూడా నా గురించి మాట్లడతావా...నువ్వెంత? నీ స్థాయి ఎంత?...అయ్య పేరు చెప్పుకొని బ్రతికే నువ్వు నా గురించి మాట్లతవా....?’’ అంటూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్.
గుంటూరు, గుిడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి అంటూ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఊరికి తాను వస్తానని, లేదంటే కేటీఆర్ కొడంగల్ రావాలని సవాల్ విసిరారు. మొత్తం నీ జాతినంతా తెచ్చుకో..ఎవడు భయపడుతుండో తెలుస్తుంది అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.
2029 ఎన్నికల్లో 119 సీట్లకుగాను 80కి పైగా సీట్లు....ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 153కు గాను 100కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2/3 వంతు మెజారిటీతో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని....కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు....చేతనైతే కాస్కోవాలని ఛాలెంజ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని..కాలకూట విషం లాంటి కేసీఆర్ ను మరోసారి అధికారంలోకి రానివ్వబోనని, ఈ విషయం మీడియా మిత్రులు రాసి పెట్టుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర ఖతం...ఆ పార్టీకి భవిష్యత్తు లేదు...ఎవరైనా ప్రజలు పొద్దుపోక మాట్లాడుకునే చరిత్ర బీఆర్ఎస్ ది అని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని రండ అని తాము కూడా తిట్టగలమని, కానీ, విజ్ఞత అడ్డువస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదని అన్నారు.