ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రధాన నవ నగరాల పనుల్లో పురోగతి పుంజుకుంది. దీంతో వివిధ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వివిధ జాతీయ బ్యాంకులు.. తమ ప్రధాన కార్యాలయాల ను నిర్మించేందుకు వీలుగా శంకుస్థాపనలు చేశాయి. త్వరలోనే ఈ నిర్మాణాలు కూడా పూర్తి కానున్నాయి.
ఈ పరంపరలో తాజాగా మరో కీలక ముందడుగు పడింది. నవనగరాల్లో ఒకటైన న్యాయ నగరానికి సంబం ధించిన పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ... సహా పలువురు న్యాయాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. న్యాయ నగరంలో ప్రధానంగా.. రాష్ట్ర హైకోర్టును నిర్మించనున్నారు. దీనిని మొత్తం 8 అంతస్థుల్లో నిర్మిస్తారు. దీనికే తాజాగా ంత్రి శంకుస్థాపన చేశారు.
రెండు ఫ్లోర్లలోనూ.. పార్కింగ్‌కు కేటాయించగా.. మిగిలిన వాటిలో 5వ ఫ్లోర్‌ను ప్రధాన న్యాయమూర్తి కార్యా లయానికి వినియోగిస్తారు. ఇతర ఫ్లోర్లలో ఒకటి.. బార్ అసోసియేషన్, న్యాయవాదులకు కేటాయిస్తారు. మిగిలినవన్నీ.. న్యాయస్థానానికి కేటాయిస్తారు. ఈ నిర్మాణాలను `నార్మన్ ఫోస్టర్` సంస్థకు అప్పగించారు. గతంలో 2014-19 మధ్య ఈ టెండరును ఈ సంస్థే దక్కించుకుంది. అయితే.. వైసీపీ వచ్చాక పనులు నిలిచిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ సంస్థకే పనులు ఇచ్చారు.
ఇవీ విశేషాలు..
+ మొత్తం హైకోర్టు: 8 అంతస్థులు (జీ+7)
+ నిర్మాణానికి కేటాయించిన భూమి: 27 లక్షల చదరపు అడుగులు(25 ఎకరాలు దాదాపు)
+ మొత్తం 52 కోర్టు హాళ్లు నిర్మాణం.
+ 5వ అంతస్థులో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం, విశ్రాంతి భవనం ఏర్పాటు
+ నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ ఏర్పాటు.
+ 2027 నాటికి హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.