సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబుడులు పెట్టాలంటే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ దేశవిదేశాల్లో పర్యటనతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు, లోకేశ్ ల విదేశీ పర్యటనల వల్ల పెట్టుబడులు రాలేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ నేతలు కాదు...ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా కౌంటర్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఏపీకి ఎక్కువ పెట్టుబడులు దక్కాయని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.
25.3% పెట్టుబడులతో ఏపీ టాప్ లేపిందని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై మంత్రి లోకేశ్ స్పందించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనని, పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని ఆయన అన్నారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 613 ఒప్పందాలు, రూ.13.26 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు కుదిరిన సంగతి తెలిసిందే.