ఏపీలో కూటమి ప్రభుత్వానికి 2026 కొత్త మెరుపులు తీసుకురానుందా? ఇప్పటి వరకు జరిగిన 18 నెలల పాలనకంటే.. వచ్చే ఏడాది మరింత ఉత్తుంగతరంగంగా .. పాలన ముందుకు సాగనుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తొలి 18 నెల్లలో ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టారు. అదేవిధంగా సంక్షేమ పథకా లను అమలు చేశారు. క్షేత్రస్థాయిలో సోషల్ మీడియా దూకుడుకు కళ్లెం వేశారు. అదేసమయంలో మార్పుల దిశగా కూడా అడుగులు వేశారు.
ఇక, 2026 నుంచి అసలు సిసలు పాలన ప్రారంభం కానుంది. దీనిలోనూ పాలన కొత్త పుంతలు తొక్కనుం ది. ప్రధానంగా నాలుగు రంగాల్లో కీలక మార్పులు రానున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మరింతగా ప్రభు త్వం చేరువ కానుంది. 1) స్వర్ణగ్రామ పంచాయతీలు: వీటి ద్వారా.. గ్రామాభ్యుదయానికి కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటారు. అలానే.. గ్రామాల్లో అభివృద్ధికి మెరుగైన విధానాలు అమలు చేస్తారు. తద్వారా.. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను ఇంటింటికీ చేరువ చేయనున్నారు.
2) పెట్టుబడులు: గత 18 మాసాల్లో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు.. ఈ ఏడాది సాకారం కాను న్నాయి. 2026ను పెట్టుబడులకు బెంచ్ మార్కుగా నిర్ణయించారు. అంటే.. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల మేరకు.. రాష్ట్రానికి వచ్చే సంస్థలు గ్రౌండ్ అయ్యేలా 2026 కీలక రోల్ పోషించనుంది. తద్వారా.. 20 లక్షల ఉద్యోగాల్లో 10 లక్షల ఉద్యోగాలను ఈ ఏడాది కల్పించాలని సర్కారు సంకల్పించుకున్న లక్ష్యం నెరవేరనుంది. దీనికి తోడు కొత్తగా జాబ్, సంక్షేమ క్యాలెండర్లను కూడా జనవరిలో విడుదల చేసి.. ప్రభుత్వ పనితీరును మెరుగు పరుచుకోనున్నారు.
3) సంక్షేమం: ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చిన సూపర్ సిక్స్‌ను ఈ ఏడాది మరింత మందికి చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు అమలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాల్లో కొందరు లబ్ధిదారుల పేర్లు రాలేదు. వీరిని ఈ ఏడాది చేర్చాలని నిర్ణయించుకున్నారు. తద్వారా అర్హులందరికీ న్యాయం చేయాలని భావిస్తున్నారు. 4) సంతృప్త గ్రాఫ్: దీనిని మరింత పుంజుకు నేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనినికూడా 2026లోనే 85 నుంచి 99 శాతానికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.