సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతం: చంద్ర‌బాబు

admin
Published by Admin — January 06, 2026 in Andhra
News Image

ఏదైనా విష‌యంలో స‌క్సెస్ అయ్యామంటే.. ఆ స‌క్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంద‌ని సీఎం చంద్ర బాబు అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జ‌రిగింది. వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెల‌ప‌నుంది. ఈ నేప‌థ్యంలో ప‌రిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించ‌నుంది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. 2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని తెలిపారు. అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని సూచించారు.

రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారంటూ సీఎం చంద్రబాబు కితాబునిచ్చా రు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని వివ‌రించారు.

ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని చంద్ర‌బాబు సూచిం చారు. 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశాం... ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశామ‌న్న ఆయ‌న‌.. 13 పైసలు చొప్పున యూనిట్ విద్యుత్ ఛార్జీలు తగ్గించామ‌ని గుర్తు చేశారు. రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించామ‌న్నారు.

విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను 3రూపాయ‌ల‌. 70 పైస‌ల‌కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. విద్యు త్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని తెలిపారు. దావోస్ సదస్సుకు వెళ్లిన‌ప్పు డు ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగామ‌న్నారు. ``సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది... ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి`` అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. 

Tags
Cm chandrababu success kick different
Recent Comments
Leave a Comment

Related News