కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొద్దిరోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ పై కవిత నోరు జారారు. కేసీఆర్ ఏం పీకి కట్టలు కట్టారంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఇక తనకు అన్యాయం జరిగిందని శాసనమండలిలో కవిత చేసిన కామెంట్లపై ఆమె సోదరుడు కేటీఆర్ పరోక్షంగా స్పందించారు.
కుటుంబంలో సమస్యలు సహజమని, ఏవైనా ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకుని కలిసి పోరాడాలని ఆయన అన్నారు. ఓ సభలో పార్టీ శ్రేణులకు ఆయన ఈ విధంగా పిలుపునిచ్చారు. విభేదాలను పక్కన పెట్టి, 2028 ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మూడేళ్లు టైంపాస్ చేసుకోవాలని చెప్పారు. కేసీఆర్ ను మొలకెత్తనివ్వనంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను మొలకెత్తనివ్వకపోవడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. తెలంగాణను తెచ్చిన మొగోడు కేసీఆర్ అని అన్నారు కేసీఆర్ కాలి చెప్పు ధూళికి కూడా కాంగ్రెస్ నేతలు సరిపోరని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.