ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మతబోధకుడు కేఏ పాల్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో...కామెడీ స్పీచ్ లతో ఆయన మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటారు. ప్రపంచ యుద్ధాలు ఆపానని చెప్పడం మొదలు...ఏపీ సీఎంను డిసైడ్ చేయగలనని చెప్పే వరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రోలర్స్ కు మంచి స్టప్ గా మారాయి. ఈ క్రమంలోనే
తాజాగా పాల్ నోటి నుంచి మరోసారి ఆణిముత్యాలు జాలువారాయి.
జగన్ మరోసారి సీఎం కాకూడదని ప్రార్థన చేశానని, అందుకే 2024లో జగన్ ఓడిపోయాడని పాల్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. 16 నెలల క్రితం జగన్ ను కలవడానికి వెళ్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, తనను జగన్ కలవలేదని అన్నారు. ఒక్క ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డికి పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందని పాల్ శాపనార్థాలు కూడా పెట్టారు. జగన్ ఏం తక్కువ తినలేదని, 5 లక్షల కోట్లు అప్పు చేశాడని విమర్శించారు.