ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేదు. సినీ రంగంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ లో కూడా అనుభవం ఉంది. తన చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ తో పవన్ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ఓ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ చరిత్ర పుటల్లోకెక్కారు.
మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ కు ఉన్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ పవన్ కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో పవన్ నైపుణ్యానికి జపాన్‌కు చెందిన 'సోగో బుడో కన్‌రి కై' సంస్థ 5th డాన్ (ఫిఫ్త్ డాన్) పురస్కారాన్ని అందించింది. జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'కి చెందిన 'టకెడా షింగెన్ క్లాన్'లో పవన్ కు ప్రవేశం లభించింది. 'కెండో'లో పవన్ ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.