అమరావతిపై వైసీపీ నేతలు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. అమరావతిని మాజీ మంత్రి బొత్స శ్మశానంతో పోల్చిన వైనం వివాదాస్పదమైంది. ఇక, అమరావతి వేశ్యల రాజధాని అంటూ వైసీపీకి అనుకూలంగా ఉంటారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన కామెంట్లు దుమారం రేపాయి. అయితే, జగన్ అండ్ కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే మొక్కవోని దీక్షతో అమరావతి రాజధాని పనులను సీఎం చంద్రబాబు రీస్టీర్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ గతంలో హేళన చేశారని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని అన్నారు. అమరావతి అభివృద్ధిలో రైతులనూ భాగస్వామ్యులను చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత దేశంలో మరే రాష్ట్రం ఏపీతో పోటీ పడే పరిస్థితి ఉండదని తెలిపారు. పోలవరం నీళ్లు తెలంగాణ ప్రజలు కూడా వాడుకోవచ్చని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు తానెప్పుడూ అడ్డుపడలేదని గుర్తు చేశారు.