రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి.. మళ్లీ.. మళ్లీ- అనే నినాదం వినిపిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు పెద్ద ఎత్తున చెబుతున్నారు. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా వారు 15 ఏళ్ల పాలనపైనే ఎక్కువగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కూటమి బలంగా ఉండాలన్నా.. మరోసారి విజ యం దక్కించుకోవాలన్నా.. కీలకమైన గ్రాఫ్‌లు కాపాడుకోవాల్సిందే.
ఈ క్రమంలో ప్రస్తుతం టీడీపీకి, జనసేనకు ఉన్న గ్రాఫ్‌లను పరిశీలిస్తే.. ప్రజలను తమవైపు తిప్పుకొనేం దుకు.. సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి, పెట్టుబడుల సాకారం వంటివి కనిపిస్తున్నా యి. దీనికి తోడు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు కూడా కూటమి సర్కారు గ్రాఫ్‌ను పెంచేందుకు దోహదపడనున్నాయన్న వాదనలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచాయి.
అయితే.. ఎన్ని పథకాలు ఇచ్చామన్నది ముఖ్యమే అయినా.. ఇవే మరోసారి ప్రభుత్వాన్ని తీసుకువస్తా యా? అనేది మాత్రం ప్రశ్న. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కూడా అనేక పథకాలను అమలు చేసింది. జగనన్న ఇళ్లు పేరుతో స్థలాలను కూడా ఇచ్చింది. ఇక, నవరత్నాలు పేరుతో ప్రజలకు నిధులు కూడా ఇచ్చింది. అయినా.. ఎన్నికల్లోకి వచ్చేసరికి స్థానిక పరిస్థితులు, సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది.
గత అనుభవాలను పరిశీలిస్తే.. కూటమి సర్కారు 15 ఏళ్ల పాటు కలివిడిగా ఉండాలంటే.. ఖచ్చితంగా 5 సూత్రాలను పాటించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. 1) ప్రజల్లో బలమైన ఆకాంక్షను రేకెత్తించడం. 2) కూటమి నాయకుల మధ్యకలివిడిని మరింత పెంచడం. 3) ఏ సమస్య వచ్చినా.. మేము న్నామనే.. స్థాయిలో నాయకులు ప్రజలకు చేరువ అయ్యేలా వ్యవహరించడం. 4) పవన్ సహా.. నారా లోకేష్ గ్రాఫ్‌లను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేయడం. 5) పెట్టుబడుల సమీకరణ ద్వారా వచ్చిన ఉద్యోగ, ఉపాధి అంశాలపై మరింత ప్రచారం చేయడం. ఈ ఐదు సూత్రాలు పాటిస్తే.. కూటమికి తిరుగు ఉండదని అంటున్నారు పరిశీలకులు.