టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అసలు తాను ఇంత గ్లామరస్‌గా ఉండటానికి కారణం ఏంటో చెబుతూ.. తన చిన్ననాటి మద్యం ముచ్చటను కూడా పంచుకుంది.
సాధారణంగా సెలబ్రిటీలు తమ అలవాట్లను బయటపెట్టడానికి సంకోచిస్తుంటారు. కానీ నిధి మాత్రం చాలా ఓపెన్‌గా ఒక విషయాన్ని రివీల్ చేసింది. తనకు కేవలం 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిసారి మద్యం రుచి చూశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టైప్ లో ఫ్రెండ్స్ తో కలిసి తాగడం సరదాగా అనిపించేదని.. కానీ కలక్రమేనా మద్యం తనకు సరిపడదని తెలుసుకున్నానని నిధి పేర్కొంది.
మద్యం సేవించిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా అనిపించేది.. అందుకే మద్యం అలవాటును పూర్తిగా దూరం చేసుకున్నాను. చివరిసారిగా తాగి ఆరేళ్లు అవుతుంది. చాలామంది పార్టీలంటే మద్యం ఉండాలని అనుకుంటారు, నా ఫ్రెండ్స్ లో కూడా కొందరు తాగుతారు. కానీ నేను మాత్రం గ్రీన్ టీ లేదా వాటర్‌తోనే పార్టీల్లో ఎంజాయ్ చేస్తాను. తన చర్మం మెరిసిపోవడానికి, ఫిట్‌గా ఉండటానికి ప్రధాన కారణం మద్యానికి దూరంగా ఉండటమే, అదే తన గ్లామర్ సీక్రెట్ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.