ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు తమ వంతు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఎన్నారైలు కదం తొక్కారు. ఇక, 2014-19 మధ్య కూడా అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా ఎన్నారైలు సంకల్పించారు. తమ సొంత డబ్బులతో ఏపీఎన్ ఆర్ టీఎస్ ఆధ్వర్యంలో అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ‘ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్’ నిర్మించాలని రంగం సిద్ధం చేశారు.