పుట్టినరోజు నాడు పెట్టుబడుల వేట: దావోస్‌లో లోకేష్ విజయ విహారం!

admin
Published by Admin — January 23, 2026 in Andhra
News Image

సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబ సభ్యులతో గడపాలని, వేడుకలు చేసుకోవాలని ఆశిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శైలి మాత్రం ఇందుకు భిన్నం. దేశం కాని దేశంలో, గడ్డకట్టే చలిలో కూడా తన రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సు చివరి రోజైన గురువారం లోకేష్ గారి పుట్టినరోజు. అయితే, ఆ సంబరాలకు దూరంగా, అర్థరాత్రి వరకు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ అంకితభావం, పట్టుదలే ఆయనను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నేతగా నిలబెట్టాయి.

అంకెల్లో లోకేష్ 'స్పీడ్': 4 రోజులు - 45 కార్యక్రమాలు

దావోస్ వేదికగా ఏపీ బృందానికి నేతృత్వం వహించిన లోకేష్, కేవలం నాలుగు రోజుల్లోనే ఒక ప్రభంజనం సృష్టించారు. ఆయన పనితీరు చూసి ఇతర దేశాల ప్రతినిధులే ఆశ్చర్యపోయారు:

25 ముఖాముఖి చర్చలు: దిగ్గజ సంస్థల సి.ఇ.ఓలతో నేరుగా భేటీ.

8 రౌండ్ టేబుల్ సమావేశాలు: ఏపీ వనరులు, రాయితీలపై స్పష్టమైన వివరణ.

5 అంతర్జాతీయ మీడియా ఇంటరాక్షన్స్: గ్లోబల్ వేదికపై ఏపీ బ్రాండ్‌ను చాటిచెప్పారు.

2 గవర్నమెంట్ టు గవర్నమెంట్ (G2G) మీటింగ్స్: అంతర్జాతీయ సహకారం కోసం అడుగులు.

మంత్రి లోకేష్ చొరవతో RMZ సంస్థ ఏకంగా $10 బిలియన్ డాలర్ల (దాదాపు ₹83,000 కోట్లు) భారీ పెట్టుబడితో రాష్ట్రానికి వచ్చేందుకు ముందుకు రావడం ఒక సంచలనం.

దేశంలోనే దూకుడుగా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో పారిశ్రామికవేత్తలను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నారు. 

గతంలో వచ్చిన ₹2.5 లక్షల కోట్ల పెట్టుబడుల కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో ఫలితాలు వస్తాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 25 కొత్త పారిశ్రామిక పాలసీలను పెట్టుబడిదారులకు వివరించడంలో ఏపీ బృంద నాయకుడిగా లోకేష్ వంద శాతం సక్సెస్ అయ్యారు.

దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు సరికొత్త 'పెట్టుబడుల పండుగ'ను తీసుకొచ్చి, తన పర్యటనను విజయవంతంగా ముగించుకున్న లోకేష్ శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పుట్టినరోజును కూడా త్యాగం చేసిన ఈ యువనేత స్పూర్తి అభినందనీయం!

Tags
Davos investments meetings birthday Minister lokesh
Recent Comments
Leave a Comment

Related News