ఆంధ్రప్రదేశ్ మంత్రి మరియు మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను యూకేలోని కోవెంట్రీ నగరంలో NRI TDP UK – కోవెంట్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కోవెంట్రీ నగరంలోని లోకేష్ బాబు అభిమానులు అందరూ కలిసి భారీ కార్ ర్యాలీ నిర్వహించి, “జై లోకేష్” నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. అనంతరం ర్యాలీగా కార్యక్రమ స్థలానికి చేరుకుని, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి, దీప ప్రజ్వలన చేసి, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను అలరించారు.
తదుపరి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పాటను ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ తరువాత భారీ కేక్‌ను NRI TDP UK – కోవెంట్రీ ఆధ్వర్యంలో కట్ చేసి, లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ “కాబోయే సీఎం నారా లోకేష్” అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో NRI TDP UK వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వ గారు, NRI TDP వింగ్ ప్రసన్న గారు, డా. సుందర్ గారు, కోవెంట్రీ సిటీ తెలుగు యువత అధ్యక్షులు లింగ రవితేజ గారు, వంశీ, శశాంక్, యశ్వంత్, సుధాకర్, నాయుడు, నాగేంద్ర, హరి, నందు, కమేష్, కుమార్, అంజి, బోడె, సుదర్శన్, దీపక్, చైతు, మనోజ్, సందీప్, సతీష్, కృష్ణతో పాటు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను సన్మానించి అభినందించారు.