అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం రెడీ

admin
Published by Admin — February 01, 2026 in Andhra
News Image

అమరావతిని వైసీపీ నేతలు ఏ రేంజ్ లో నాశనం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అమరావతిని శ్మశానం అని అభివర్ణంచడం మొదలు..అక్కడ పనులు గాలికి వదిలేసి పిచ్చి మొక్కలు పెరిగేలా చేసి...అడవిని తలపించేలా వాతావరణం సృష్టించడం వరకు వైసీపీ నేతలు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు బుల్లెట్ ట్రైన్ మాదిరి దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి.

అమరావతి పరిధిలోని నవులూరు వద్ద నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయిందని ఏపీ మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఆ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాయి. అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో దానిని సిద్ధం చేస్తున్నారు.

24 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 34 వేల సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడకు 13 కిలోమీటర్లు, గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతికి సమీపంలో ఆ స్టేడియం నిర్మితమ‌వుతోంది. మిగిలిన 10 శాతం పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి స్టేడియాన్ని త్వరలోనే అందుబాటులోకి తేవాలని ఏసీఏ, మున్సిపల్ శాఖ అధికారులు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

https://x.com/CDMA_Municipal/status/2017173831069368336?t=umxEblQK2yUmgkQldMY1sw&s=09

 

Tags
International cricket stadium amaravati ready
Recent Comments
Leave a Comment

Related News