టాలీవుడ్ గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ `డ్రాగన్`. `ఆర్ఆర్ఆర్`, `దేవర` వంటి భారీ విజయాల తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమా షూటింగ్ కోసం మేకర్స్ రోజుకు ఏకంగా కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట.
సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా మొత్తం బడ్జెట్‌తో పోలిస్తే, కేవలం ఒక్క రోజు షూటింగ్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ జోర్డాన్‌లో ఒక కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ నిర్వహించిన యాక్షన్ సీక్వెన్స్, అలాగే కొన్ని కీలక సన్నివేశాల కోసం మేకర్స్ ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేశారని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో, అత్యాధునిక సాంకేతికతను, భారీ క్రూను అక్కడ వినియోగించినట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ అవుట్‌పుట్ చూసి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ఎంతో సంతోషంగా ఉన్నారట. ఖర్చుకు తగ్గట్టే విజువల్స్ చాలా గ్రాండ్‌గా, ముందెన్నడూ చూడని విధంగా వచ్చాయని టాక్. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో రా అండ్ రస్టిక్ యాక్షన్‌ను ఈ సినిమాలో చూపిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం ఆ సన్నివేశాలకు ప్రాణం పోయనుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న డ్రాగన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా కేవలం షూటింగ్‌కే ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారంటే, ఇక వెండితెరపై తారక్ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.