యుకేలోని కోవెంట్రీ నగరంలో తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పెదయన నందమూరి తారక రామారావు గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని 44 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిన తీరు, అలాగే పార్టీ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. అదేవిధంగా, ఈ సందర్భంగా “జై లోకేష్… జై జై లోకేష్” అంటూ నినాదాలు చేశారు, నారా లోకేష్ గారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీకి చెందిన కోవెంట్రీ నగరంలోని తెలుగు యువత సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.