యుకేలోని కోవెంట్రీ నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ యుకే తెలుగు యువత ఆధ్వర్యంలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం బాణాసంచా కాల్చి “జై అమరావతి… జై చంద్రబాబు… జై లోకేష్” అంటూ నినాదాలు చేశారు.
ఎన్ఆర్ఐ టీడీపీ యుకే తెలుగు యువత తరపున ఎన్‌డిఏ ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోవెంట్రీ నగరంలోని తెలుగు యువత సభ్యులు మరియు నందమూరి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.