నారా లోకేష్ లైఫ్‌లో `స్వీటెస్ట్ డే` ఇదే .. !

admin
Published by Admin — January 23, 2025 in Politics
News Image

ఒక్కొక్క‌రి జీవితంలో ఒక్కొక్క రోజు తీపి గుర్తుగా నిలిచిపోతుంది. వారు నాయ‌కులైనా.. సాధార‌ణ ప్ర‌జ‌లైనా కూడా.. ఒక్కొక్క రోజు వారికి చిర‌స్థాయిగా గుర్తుంటుంది. అలాంటి రోజే.. టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ జీవితంగా గుర్తుండి పోయే రోజు. అదే.. జ‌న‌వ‌రి 23. ఈ రోజు ఆయ‌న పుట్టిన రోజు. ఇప్ప‌టికి ఆయ‌న 41 పుట్టిన రోజులు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు చేసుకునే 42 వ పుట్టిన రోజు మాత్రం నారా లోకేష్ లైఫ్‌లో స్వీటెస్ట్ డేగా నిలిచిపోతుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఏడాది ఇదే రోజు అంటే.. 2024, జ‌న‌వ‌రి 23న నారా లోకేష్ ఓ సందిగ్ధావ‌స్థ‌లో ఉన్నారు. అప్ప‌టికి వైసీపీ ప్ర‌భుత్వం ఉంది. మ‌రికొన్ని నెల‌ల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో గెలుస్తామా? లేదా? ఏంజ‌రుగుతుంది ? వైసీపీ బ‌లంగా ఉంది.. అనేక సందేహాలు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. మ‌రోవైపు.. తాను చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా.. అనేక బ్రేకుల కార‌ణంగా.. అనుకున్న ల‌క్ష్యం సాధించిందా? లేదా? అనే అనుమానాలు కూడా ఆయ‌న‌ను వెంటాడాయి. దీంతో అన్య మ‌న‌స్కంగానే అప్ప‌ట్లో పుట్టిన రోజు చేసుకున్నారు.

క‌ట్ చేస్తే.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అద్భుత విజ‌యం ద‌క్కించుకుంది. ఒక నారా లోకేష్ కు మంచి ఊపు ఇచ్చింది. అంతేకాదు.. ఒక ఓటమి త‌ర్వాత‌.. ద‌క్కిన మంగ‌ళగిరి విజ‌యం ఆయ‌న‌కు మ‌రిం త బూస్ట్ ఇచ్చింది. పైగా.. ఆ విజ‌యం ఎవ‌రూ ఊహించ‌న‌ది కావ‌డం.. భారీ మెజారిటీని సొంతం చేసుకు ని.. మంగ‌ళ‌గిరి రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే కొత్త అధ్యాయం లిఖించ‌డంతో మ‌రింత‌గా నారా లోకేష్ సంబ‌ర ప‌డ్డారు. ఇదేస‌మ‌యంలో త‌ను ఏరికోరి టికెట్ ఇప్పించుకున్న‌వారంతా విజ‌యం సాధించ‌డం మ‌రింత ఆనందాన్ని ఇచ్చింది.

 

 
Recent Comments
Leave a Comment

Related News