గుడివాడ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా..ఆ మాటకు వస్తే షాడో ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ముదరు కేసు కామేపల్లి తులసిబాబుగా తెలుగు తమ్మళ్లు వాపోతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘురామ క్రిష్ణరాజును గత ప్రభుత్వం అరెస్టు చేసి.. సీఐడీ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన ఉదంతంలోనూ ఈ తులసి పాత్ర కీలకంగా చెబుతారు. అంతేనా.. ఆ కేసు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిలో తులసి బాబే ఆరో వ్యక్తిగా చెబుతారు.
ఇక్కడితో అయిపోతే.. తులసిని చాలా తక్కువగా అంచనా వేసినట్లే. సీఐడీ మాజీ చీఫ్.. ప్రస్తుతం ప్రభుత్వ విచారణ ఎదుర్కొంటునన అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు నమ్మిన బంటుగా పేరుంది. గుడివాడను తన అడ్డాగా చేసుకొని చెలరేగిపోతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అసలు కంటే కొసరు ఎక్కువన్న చందంగా గుడివాడ ఎమ్మెల్యేకు మించిన దందాలతో.. తులసి మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతున్న వైనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
పలు మార్గాల్లో అక్రమ సంపాదన మీద ఫోకస్ చేసిన తులసి.. ఇతర నియోజకవర్గాల్లోని రీచ్ లను ంచి గుడివాడకు జరుగుతున్న అక్రమ ఇసుక రవాణలకు సంబంధించి తన కార్యకర్తలకు వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అందుకు ఎవరైనా నో అంటే.. పోలీసుల్ని పంపి లారీల్ని సీజ్ చేసి వారిని దారికి తెచ్చుకోవటంఒక అలవాటుగామారిందంటున్నారు.
దీంతో.. అతడిపై చర్యలకురంగం సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు తీరును తప్పు పడుతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే తులసి లాంటోళ్లపై మొదట్లోనే కఠిన చర్యలు చేపట్టి.. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అందుకు భిన్నంగా వారిని పెంచి పోషించి.. పెద్దోళ్లను చేసిన తర్వాత చర్యలు షురూ చేస్తే.. తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి గుర్తిస్తారో? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.