సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ టీడీపీ, వైసీపీ మధ్య వార్స్ నడుస్తుంటాయి. కానీ తాజాగా వైసీపీ జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించగా.. అందుకు ధీటుగా జనసేన కౌంటర్ ఎటాక్ చేసిది. జగన్ ను జైలు పుత్ర అని సంభోదిస్తూ విమర్శల దాడి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల నారాయణ కాలేజీలో ఓ విద్యార్థిని చనిపోయింది. ఈ ఘటపై వైసీపీ తన అధికారిక ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
దాంతో జనసేన అంతే ధీటుగా జగన్ కు స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చింది. ` సిగ్గు లేదా జైలు పుత్రా జగన్? సొంత చెల్లి, తల్లి కూడా కష్టం అని నీ దగ్గరికి వస్తే నువ్వు ఛీ కొట్టిన దుర్మార్గుడువని బహిరంగంగా చెప్పారు, అయినా బుద్ధి రాకపోతే ఎలా జైలు పుత్రా జగనా? కష్టం అని వచ్చిన వారిని అక్కున చేర్చుకుని, వారి కష్టాలు తీర్చడమే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన రాజకీయం. సోషల్ మీడియాలో ఎవరో ఒక ఫేక్ వీడియో పెట్టగానే, శవాల దగ్గర చిల్లర వేరుకునే వాడిలా కనీసం నిజాలు తెలుసుకోకుండా నీచ రాజకీయాలు చేస్తావా?
`నా కూతురు చనిపోయిందని పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తే.. కనీసం పిటీషన్ కూడా చదవలేదని, ఇప్పుడేమన్న మీ పాపను ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా? అన్నారని` వీడియోలో ఓ మహిళ రోధిస్తూ చెప్పినట్లు ఉంది. సదరు మహిళ మాటలను మొత్తం కట్ చేసి తమకు అనుకూలంగా వీడియో క్రియేట్ చేసుకున్న వైసీపీ.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి విమర్శించింది. `ఛీ.. సిగ్గుపడు దత్తపుత్రా పవన్ కళ్యాణ్. నారాయణ, చైతన్య కాలేజీల్లో దురాగతాలపై ఆరోజు శుద్ధపూసలా తెగ నీతులు చెప్పావ్.. అధికారంలోకి రాగానే ఇప్పుడు నీ అసలు బుద్ధి చూపిస్తున్నావా? ఓ విద్యార్థిని చనిపోతే.. బాధిత కుటుంబం గోడుని కూడా కనీసం వినకుండా వెటకారం చేస్తావా? ఆడబిడ్డ చావు నీకు అంత ఎగతాళి అయిపోయిందా పవన్ కళ్యాణ్?` అని వైసీపీ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించింది.
జనవాణి పేరుతో అధికారంలో లేనప్పటి నుండి నేటి వరకు కష్టం అని వచ్చిన ప్రతీ ఒక్కరి సమస్య వినే ఒక వేదిక ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నారు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వందల సమస్యలు పరిష్కారం అయ్యాయి, అందులో 90% సమస్యలు నీ దిక్కుమాలిన పాలనలో ఎదుర్కొన్నవే, అలాంటిది ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి వస్తే జనసేన పట్టించుకోదు అంటే ఎలా నమ్మావు జగనా?` అంటూ వైసీపీ ట్వీట్ కు జనసేన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇరుపార్టీల ట్వీట్స్ వైరల్ గా మారాయి.