`ఖడ్గం` బ్యూటీని ఇప్పుడు చూసిన‌ క‌ళ్లు చెద‌రాల్సిందే!

admin
Published by Admin — March 03, 2025 in Movies
News Image

2002లో విడుద‌లైన `ఖడ్గం` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీ‌కాంత్‌, ర‌వితేజ, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. సోనాలి బెంద్రే, సంగీత, కిమ్‌ శర్మ హీరోయిన్లుగా న‌టించారు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంతో వ‌చ్చిన ఖ‌డ్గం భారీ విజ‌యాన్ని సాధించ‌డంతో పాటు ఐదు నంది పురస్కారాలను అందుకుంది. అయితే ఈ మూవీలో శ్రీ‌కాంత్ స‌ర‌స‌న యాక్ట్ చేసిన కిమ్ శ‌ర్మ గుర్తుందా..? `ముసుగు వెయ్యొద్దు మనసు మీద` అంటూ కుర్ర‌కారును అల్లాడించిన కిమ్ శ‌ర్మ‌ను ఇప్పుడు చూసిన క‌ళ్లు చెద‌రాల్సిందే.

తెలంగాణ‌లో పుట్టిన కిమ్ శ‌ర్మ‌.. ముంబై ఒక పర్యటనలో భాగంగా క్లోజప్ టూత్ పేస్టు ప్రచార చిత్రంలో తొలిసారి క‌నిపించింది. ఆ త‌ర్వాత మ‌రిన్ని ప్రకటనల్లో మెరిసిన కిమ్ శ‌ర్మ ఆదిత్య చోప్రా సహకారంతో `మొహబ్బతీన్` చిత్రంలో నటించింది. 2000వ సంవ‌త్స‌రంలో ఈ మూవీ రిలీజ్ అయింది. 2002లో ఖ‌డ్గంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తొలి సినిమానే విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న కిమ్ శ‌ర్మ తెలుగులో ఫుల్ బిజీ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు.

ఖ‌డ్గం త‌ర్వాత కిమ్ శ‌ర్మ బాలీవుడ్ చిత్రాల‌కే ప‌రిమితం అయింది. చాలా గ్యాప్ త‌ర్వాత `మగధీర`లో స్పెష‌ల్ సాంగ్ చేసిన కిమ్ శ‌ర్మ‌.. 2011 నుంచి సిల్వ‌ర్ స్క్రీన్ కు పూర్తిగా దూర‌మైంది. బాలీవుడ్ నటుడు హర్షవర్దన్ రానాతో కొన్నాళ్లు ప్రేమాయణం న‌డిపాక బ్రేకప్ అవ్వ‌డంతో.. అప్ప‌టి నుంచి కిమ్ శ‌ర్మ ఒంట‌రిగానే ఉంటోంది.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే కిమ్ శ‌ర్మ ఎప్ప‌క‌టిప్పుడు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఫోటోల‌ను ఫాలోవ‌ర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు సినిమాలు చేయ‌డం మానేస్తే ఫిట్‌నెస్‌ను కోల్పోతుంటారు. కానీ కిమ్ శ‌ర్మ మాత్రం అందుకు పూర్తిగా భినం. సినిమాలు చేయ‌డం మానేసినా ఫిజిక్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. 45 ఏళ్ల వ‌య‌సులోనూ త‌న గ్లామ‌ర్ తో కుర్ర‌కారును క‌ట్టిపాడేస్తుంది.

Recent Comments
Leave a Comment

Related News

Latest News