70 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీవీకే

admin
Published by Admin — May 11, 2026 in National
News Image

త‌మిళ‌నాడులో సంప్ర‌దాయ ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా కొత్త‌గా నూత‌న స‌ర్కారు ఏర్పాటైంది. టీవీకే(tvk) అధ్య‌క్షు డు జోసెఫ్ విజ‌య్ ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కారు. నిజానికి గ‌త 70 ఏళ్ల‌గా.. ఈ రాష్ట్రంలో అయితే డీఎంకే(dmk).. కాక‌పోతే అన్నాడీఎంకే(anna dmk) ప్ర‌భుత్వాలే ఏర్ప‌డుతున్నాయి. వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చినా..ఆ రెండు పార్టీలే ఇక్క‌డ చ‌క్రం తిప్ఉతున్నాయి. ఏడు దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిప‌త్యంలోనే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది.

పెరియార్ సిద్ధాంతాలు.. సామాజిక న్యాయం, ద్రవిడుల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, వారి సంస్థాగ‌త బ‌లోపేతాలే ల‌క్ష్యంగా ఆదిలో ఏఐఏడీఎంకే(ఆల్ ఇండియా ఆది డ్ర‌విడ మున్నెట్ర‌క‌ళ‌గం) ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత‌.. ఎంజీఆర్, క‌రుణానిధులు ఉమ్మ‌డిగా రాజ‌కీయాలు చేశారు. అయితే.. త‌ర్వాత కాలంలో ఈ పార్టీ చీలిపో యి.. అన్నా డీఎంకే, డీఎంకేలుగా విడిపోయింది. డీఎంకేకు క‌రుణానిధి సార‌థ్యం వ‌హించారు. అన్నాడీ ఎంకేకు.. జ‌య‌ల‌లిత ప్రాతినిధ్యం వ‌హించారు.

ఇలా.. ఏర్ప‌డిన పార్టీలు.. ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేశాయి. ఫ‌లితంగా ఒక‌ప్పుడు త‌మిళ‌నాడులో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ కూడా.. త‌ర్వాత కాలంలో చెల్లాచెదురైంది. కేవ‌లం ద్ర‌విడ సిద్ధాంతాలే ప్రాతిప‌ది క‌గా.. ఏడు ద‌శాబ్దాలుగా ఇక్కడ రాజ‌కీయాలు కొన‌సాగాయి. అయితే.. డీఎంకే.. లేక‌పోతే అన్నాడీఎంకే అన్న ట్టుగానే అధికారం చేప‌ట్టాయి. తాజాగా.. తొలిసారి ఈ డ్ర‌విడ పార్టీలహ‌వాకు గండి కొడుతూ.. `మార్పు` పేరు తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన విజ‌య్‌..పెను సంచ‌ల‌న‌మే సృష్టించారు.

'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) త‌మిళ‌నాట‌ సరికొత్త రాజకీయ శకాన్ని సృష్టించింది. తాజా ఎన్నికల్లో ఈ పార్టీ అత్యధిక సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ఒంటరిగా బరిలోకి దిగి 108 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. దాదాపు 70 ఏళ్లుగా ద్రవిడ పార్టీల చేతిలోనే ఉన్న తమిళనాడు రాజకీయ పగ్గాలను విజయ్ పార్టీ తనవైపునకు తిప్పింది. సామాజిక న్యాయం, మ‌హిళా భ‌ద్ర‌త‌, ప్ర‌జాభ్యుదం అనే ఈ మూడు అంశాల‌ను విజ‌య్ కీల‌కంగా ఎంచుకున్నారు. 

Tags
Tvk cm vijay dmk anna dmk
Recent Comments
Leave a Comment

Related News