విజ‌య్ మ్యాజిక్.. ఒక్క ఫోటోకే 22 ల‌క్ష‌లా..!

admin
Published by Admin — May 12, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. వెండితెరపై రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్(Thalapathy Vijay), ఇప్పుడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే సీఎంఓ సోషల్ మీడియా ఖాతాలు ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా ప్రభుత్వ అధికారిక ఖాతాలకు ఫాలోవర్ల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ, విజయ్ ఫోటో సీఎంఓ డిస్ ప్లే పిక్చర్ (DP) గా మారగానే సీన్ మొత్తం మారిపోయింది. గతంలో కేవలం 4 లక్షల మంది ఫాలోవర్లతో ఉన్న తమిళనాడు సీఎంఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, విజయ్ ఫోటో దర్శనమివ్వగానే రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. కేవలం గంటల వ్యవధిలోనే ఆ సంఖ్య 16 లక్షలకు చేరుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఎక్స్ వేదికగా విజయ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సీఎంఓ (CMO) ఎక్స్ ఖాతాకు గతంలో ఉన్న 4 లక్షల మంది ఫాలోవర్లు, ఇప్పుడు ఏకంగా 22 లక్షలకు చేరుకున్నారు. ఒక నాయకుడి పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. రాజకీయ విశ్లేషకులు సైతం దళపతి విజయ్ డిజిటల్ పవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

2026 ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టాక సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ మిలియన్ల మ్యాజిక్ మరొక ఎత్తు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, పాలనలో కూడా ఇదే వేగాన్ని చూపిస్తారేమో చూడాలి. ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా సీఎం విజయ్ పేరుతో పాటు, ఈ రికార్డు ఫాలోయింగ్ గురించే చర్చ నడుస్తోంది.

Tags
Vijay Thalapathy Vijay Tamil Nadu CM TVK CM Vijay TamilNadu Politics
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News