వైసీపీ నేతలు జగన్ హయాంలో వ్యవహరించిన తీరుపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వారిలో తాజాగా ఓ రైతు వెలుగులోకి వచ్చారు. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును హైదరాబాద్‌లోని శేరిలింగం పల్లి పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపించారు. నకిలీ పత్రాలతో 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు బొల్లా ప్రయత్నించారన్నది ప్రధాన కేసు. ఈ నేపథ్యంలోనే ఆయనను తిరుచిరాపల్లిలో అరెస్టు చేసి.. హైదరాబాద్‌కు తరలించి.. అటు నుంచి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు.
కట్ చేస్తే.. బొల్లా అరెస్టుతో ఆయన సొంత నియోజకవర్గం గుంటూరులోని వినుకొండలో కొందరు సంబరాలు చేసుకున్నారు. తా జాగా ఓ రైతు.. తన శపథాన్ని వీడి.. చెప్పులు ధరించారు. దీనికి ముందు ఆయన సుమారు 12 కిలో మీటర్ల మేర పాదయా త్ర చేసి ఆలయానికి చేరుకుని.. అక్కడ చెప్పులు వేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం.. రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. గత వైసీపీ నేతలపై ఇంతగా రైతులు ఆవేదన చెందారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలానికి చెందిన రైతు నరేంద్ర తాజాగా చేసిన పాదయాత్ర పెద్ద ఎత్తన చర్చకు దారితీసింది.
ఏం జరిగింది?
వినుకొండకు చెందిన రైతు నరేంద్ర 2022లో తన ధాన్యం కొనుగోలు.. అనంతరం సొమ్ముల వ్యవహారంపై అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కలిశారు. తనకు సొమ్ములు ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. అయితే.. రైతును కనీసం గౌరవించని బొల్లా.. ఆయనపై చెప్పుతో దాడి చేశారు. అనంతరం.. తన పీఏ ద్వారా కేసు పెట్టించి.. నరేంద్రను అరెస్టు చేయించారు. స్టేషన్‌లో కూడా పోలీసులు తనను హింసించారని నరేంద్ర తెలిపారు. ఈ క్రమంలో తనను అవమానించిన బ్రహ్మనాయుడు కూడా అదే శిక్ష అనుభవించాలని.. అప్పటి వరకు చెప్పులు ధరించనని ఆనాడే తాను శపథం చేసినట్టు నరేంద్ర తాజాగా వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన చెప్పులు ధరించడం మానేశారు.
ప్రస్తుతం బొల్లా జైలు పాలైన సందర్భంగా.. తన ఆవేదన, బాధ తీరాయని.. తన శపథం కూడానెరవేరిందని రైతు నరేంద్ర చెప్పా రు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు.. రైతు సోదరులతో కలిసి.. వినుకొండ కేంద్రం నుంచి బొల్లాపల్లి మండలం వరకు పాద యాత్ర నిర్వహించారు. అనంతరం.. స్థానిక ఆలయంలో పూజలు చేసి.. తన శపథాన్ని నెరవేర్చిన దేవుడికి మొక్కులు చెల్లించు కున్నారు. తర్వాత.. చెప్పులు వేసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికంగా ప్రజల్లో వైసీపీ సర్కారుపై ఎంత వ్యతిరేకత వుందనే ది స్పష్టమైంది. చిత్రం ఏంటే.. గురువారం సాయంత్రమే.. వైసీపీ అధినేత జగన్.. తమ ప్రభుత్వమే భేష్ చెప్పుకొన్న సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.