యూట్యూబర్ రావణ్ వ్యవహారం రోజు రోజుకు మరింత ముడిపడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి.. మళ్లీ బెయిల్‌పై విడుదలైన అతనిని.. ఇటీవల ఉపా కేసులో అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించారు. ఈ సమయంలోనే రావణ్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో పలు వివాదాస్పద వీడియోలు, కామెంట్లు ఉన్నట్టు గుర్తించారు.
తాజాగా వీటితోపాటు.. మహిళలు, యువతలకు సంబంధించి సెక్స్‌వీడియోలు, వారిని బెదిరించి వారితో సెక్స్ చేయడం.. లైగింక కామెంట్లు, వివాదాస్పద కంటెంట్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో మరింతగా ఈ ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని రాబట్టేందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఇప్ప టికేవందల వీడియోలను రావణ్ డిలీట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా వాటిని కూడా రికవరీ చేయనున్నట్టు తెలిపారు.
ఈ వీడియోల ఆధారంగా బాధితులను విచారించేందుకు, వారి నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు రంగం రెడీ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో రావణ్‌పై ఉపా చట్టం కింద కేసునమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ లబించడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు సెక్స్ వీడియోలు బయటపడుతున్న నేపథ్యంలో పోక్సో కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా రావణ్‌పై ఇంకా కేసులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా కేసులన్నింటినీ.. ఒకే విడతగా ఫైల్ చేసి.. పీటీ(ప్రిజనరీ) వారెంట్ ఇచ్చి.. విచారించాలని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రావణ్‌పై మరిన్ని కేసులు, దర్యాప్తులు ముమ్మ రం కానున్నాయి. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వరకు రావణ్‌కు అనుకూలంగా మాట్లాడిన న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌పైనా ఐటీ చట్టం కింద కేసు పెట్టాలని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదాయ పన్నును ఎగవేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.